ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ లో పెళ్లిళ్ల జోరు పెరిగింది. కొంత కాలంగా ప్రెమించుకొని తర్వాత పెళ్ళి పీటలు ఎక్కుతున్న జంటలు చాలానే ఉన్నాయి..మొన్నీమధ్య ఆది పినిశెట్టి, నిక్కీ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముద్దు గుమ్మా పెళ్ళి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె విమలా రామన్.. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించింది..ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది.. ఒక్కో సినిమా లో తన నటనకు పెంచుకుంటూ ఎన్నో సినిమాల లో నటించింది.మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోనూ అనేక చిత్రాలు చేసింది..


తెలుగులో కూడా మంచి చిత్రాలలో నటించి అందరి అభిమానాన్ని చూరగొంది. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంది.. ఇప్పుడు అమ్మడు పెళ్ళి  కి రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. తమిళ హీరో, విలన్ వినయ్‌రాయ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విమల త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనున్నట్లు టాక్.. ఈ వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ జంట సినిమాల కన్నా కూడా ఎక్కువగా ట్రిప్ లకు వేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఆ మధ్య మాల్దీవులు వెళ్లిన ఈ జంట అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానుల తో పంచుకున్నారు.


మొదటి సినిమా తోనే మంచి ఫెమ్ అందుకున్న హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు..జయం కొందాన్‌, ఎంద్రెంద్రమ్‌ పున్నగై వంటి పలు హిట్‌ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. తుప్పరివలన్‌ సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గానూ అదరగొట్టాడు.. ఆ సినిమాలు అన్నీ కూడా అతడికీ మంచి పేరును అందించాయి.ప్రస్తుతం ఈ హీరో హీరో సూర్య నిర్మిస్తున్న 'ఓ మై డాగ్‌' సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా హిట్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వీరి పెళ్ళి సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: