ఫస్ట్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి అండగా వుంటున్న తెలంగాణ ప్రభుత్వం భారీ సినిమాల టికెట్ రేట్లని పెంచుకునే వెలుసుబాటుని కల్పిస్తూ ఈమధ్యనే జీవోని కూడా జారీ చేయడంతో ఇండస్ట్రీ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం ఆ సపోర్ట్ లభించకపోవడంతో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు స్టార్ ఇంకా డైరెక్టర్స్ రాజమౌళి,కొరటాల శివలతో కలిసి ఏపీ ముఖ్యమంత్రిని కూడా ఒప్పించిన సంగతి తెలిసిందే.దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకునే విధంగా వెసులు బాటుని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తూ వస్తున్నాయి. ఇదిలా వుంటే తాజాగా కన్నడ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమా బృందానికి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ టికెట్ రేట్లని పెంచుకోవచ్చని తాజాగా జీవోని కూడా విడుదల చేసింది. దీంతో యష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పెంచిన రేట్ల ఆధారంగా బాక్సాఫీస్ లెక్కలు మారనున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.



తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్స్ టికెట్ కి 50 రూపాయల వరకు సాధారణ ఏయిర్ కండీషన్ థియేటర్లలో 30 దాకా పెంచుకునే విధంగా వీలు కల్పించారు. పెంచిన ఈ రేట్లు సినిమా విడుదల రోజు నుంచి నాలుగు రోజుల పాటు అమలులో వుండనున్నాయి. ఇదిలా వుంటే 'కేజీఎఫ్ చాప్టర్ 2'మరో రెండు రోజుల్లో అంటే ఏప్రీల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు బాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.చాప్టర్ 1 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో చాప్టర్ 2 పై కూడా ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాప్టర్ 1 కి మించి 2లో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ ఇంకా రవీనా టాండన్ తో పాటు టాలీవుడ్ నటులు ప్రకాష్ రాజ్ రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సినిమా ఏ స్థాయిలో ఫస్ట్ పార్ట్ ని మించి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకోబోతోందో స్పష్టం చేశారు.దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో తో 'కేజీఎఫ్ చాప్టర్ 2' బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సినిమా ఏ రేంజ్ ని టచ్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 14 వ తేదీ ఉదయం ఆట వరకు వేచి చూడాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: