టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఇంకా బిజినెస్ మ్యాన్ గా మురళి మోహన్ బాగా నిలదొక్కుకున్నారు.ఇంటర్ కంప్లీట్ అయిన తరువాత విజయవాడలో ఓ చిన్నపాటి షాప్ పెట్టి ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు. పెళ్ళైన తరువాత ఆయన తన బిజినెస్ పైనే పూర్తి దృష్టి పెట్టారు. ఆ సమయంలోనే ఆయనకి సినిమాల్లో అవకాశం రావడం జరిగింది. ఇక సినిమాల్లో సక్సెస్ అయితే అటు వెళదాం లేదంటే బిజినెస్ లోనే కొనసాగుదాం అని ఆయన అప్పుడు అనుకున్నారు.ఇక మురళీమోహన్ ఆ నిర్ణయం తీసుకోడం వెనుక ఆయన భార్య ప్రోత్సాహం కూడా ఉంది. ఇక సినిమా ఫీల్డ్ లోకి రావడానికి ముందు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తాను శోభన్ బాబుగారిని కలుసుకున్నాననీ తనని సినిమాల్లోకి రమ్మని ఆయన కూడా అనడంతో తనపై తనకి ఒక నమ్మకం కలిగిందని మురళీ మోహన్ చెప్పారు. ఇక సినిమాల్లోకి వచ్చిన తరువాత దాసరి నారాయణ రావు గారు తనకి అండగా నిలిచి వరుస అవకాశాలు ఇస్తూ వెళ్లారనీ నటుడిగా ఇంకా ఆర్ధికంగా ఈ రోజున తాను ఈ రేంజిలో ఉండటానికి కారణం ఆయనేనని అన్నారు.హీరోగా ఇంకా కేరక్టర్ ఆర్టిస్టుగా చాలా దూరం ప్రయాణించిన మురళీ మోహన్ సొంత బ్యానర్ ను క్రియేట్ చేసుకుని నిర్మించిన చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి.



ఇక రియల్ ఎస్టేట్ పరంగా కూడా మురళి మోహన్ తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. ఈ రోజున మురళీమోహన్ ఎంత ధనవంతుడనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయినా మురళీ మోహన్ దంపతులు చాలా సింపుల్ ఉంటారని వారి కోడలు రూప మాగంటి ఒక సందర్భంలో చెప్పారు. ఇక ఆమె మాట్లాడుతూ .."మా మామయ్యగారు ఇప్పటికీ ఖరీదైన బట్టలు కొనడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే అత్తయ్య ఆభరణాల పట్ల కూడా ఆయన ఆసక్తిని చూపరు.ఇక అప్పుడప్పుడు మా అత్తగారు చెబుతూ ఉంటారు. విజయవాడలో మమ్మయ్యగారు మోటార్ల షాపుని నడిపేవారు. 200 రూపాయలతో వాళ్ల జీవితాన్ని స్టార్ట్ చేశారట. వారానికి కేవలం ఒకసారి మాత్రమే సినిమాకి వెళ్లేవారట. ఎక్కడికైనా కానీ సైకిల్ పైనే వెళ్లి వచ్చేవారట. అయినా ఆ రోజులే ఎంతో ఆనందంగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇంట్లో అన్ని పనులు ఆమెనే చేస్తారు. ఇక ఒకసారి మా అత్తయ్య ఏదో పనిచేస్తూ ఉండగా ఎవరో వచ్చారు. 'అమ్మగారిని పిలవవమ్మా' అని ఆమెతోనే అన్నారు. నేనే అమ్మగారిని అని అత్తయ్య అనడంతో వాళ్లు షాక్ షాక్ అయ్యారు. అంత సింపుల్ గా కనిపిస్తారామె" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: