యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయి ప్రస్తుతం అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా పై ఇప్పటి వరకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు.  దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు,  హీరో ఉపేంద్ర ఇప్పటికే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ కూడా కే జి ఎఫ్ చాప్టర్ 2  సినిమా పై ప్రశంసల వర్షం కురిపించాడు.  

ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా  కే జి ఎఫ్ చాప్టర్ 2  సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముందుగా హోంబలే ఫిలిమ్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నాను. మరియు నా బ్రదర్ ప్రశాంత్  నీల్ కి కూడా. ప్రశాంత్ నీల్ మొరోసారి తన టేకింగ్ తో అద్భుతాలు చేశాడు. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ గా ఉంది.

ఆయన పెర్ఫార్మెన్స్ తో  అదరగొట్టాడు. సంజయ్ దత్ , రవీనా టాండన్ , ప్రకాశ్ రాజ్ ,  రావు రమేశ్ తమ నటనతో బెస్ట్ ఇచ్చారు. వీరితో పాటు శ్రీ నిధి శెట్టి ,   అర్చన ఫెంటాస్టిక్ వర్క్ ను అందించారు. ఈ మూవీ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ  కంగ్రాట్స్ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: