కొత్త సినిమాలకు కొదవ లేదు..సినిమాలు హిట్ అయిన లేకున్న వరుస సినిమాలు మాత్రం జనాల ముందుకు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు పోటీగా చిన్న సినిమాలు కూడా రావడం విశేషం..కొన్ని సినిమాలు ఘన విజయాన్ని అందుకుంటే మరి కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫిస్ వద్ద డీలా పడుతున్నాయి. ట్రైలర్, టీజర్ వరకూ ఆకట్టుకుంటూ వస్తున్న సినిమాలు జనాల ముందుకు వస్తే మాత్రం నెగిటివ్ టాక్ ను అందుకోవడం రెండు రోజులకే దుకాన్ సర్దు కోవడం జరుగుతుంది.. ఇప్పుడు మరో కొత్త ట్రైలర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది..


పేపర్ బాయ్, ఏక్ మినీకథ' లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ కుర్రాడు తాజాగా నటిస్తున్న చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'..ఈ సినిమా షూటింగ్ పనులను బిజీగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు.గోల్డ్‌బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. '96, జాను' చిత్రాల్లో కథానాయికల చిన్నప్పటి పాత్రను పోషించిన గౌరీ కృష్ణన్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది.


సినిమా లవ్, కామెడీ, ఎమొషనల్ సన్నీవేశాలతో తెరకెక్కుతుంది.మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూన్నారు.ఈ సినిమా ట్రైలర్ ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.హీరోకి నోటివాటమెక్కువ, హీరోయిన్‌కు చేతివాటమెక్కువ అంటూ పాత్రలను పరిచయం చేయడం బాగుంది. సంతోష్ శోభన్ యాక్టింగ్, గౌరీ అల్లరి ప్లస్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ట్రైలర్ మొత్తం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ సినిమా విడుదల తెదిని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: