ఇండియాలోని మాస్ ప్రేక్షకులు క్లాస్ ప్రేక్షకులు అని తేడా లేకుండా అందరినీ విపరీతముగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కట్టుకుంటోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తముగా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్ లు కొంచెం కూడా తగ్గకుండా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ కు మంచి పేరు వస్తోంది. ఇప్పటికే పలు నిర్మాతలు ఇతని డేట్ ల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. కేవలం మూడు సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది తన హార్డ్ వర్క్ తో దానిని నిజం చేసి చూపించాడు. ఈ సినిమాలో ఉన్న పాత్రధారులు అంతా కూడా డైరెక్టర్ చెప్పిన విధంగా నటించి సినిమా సక్సెస్ లో భాగం అయ్యారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కేజీఎఫ్ 2 గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో నటించిన పాత్రధారుల వ్యక్తిగత జీవితాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కేజీఎఫ్ లో హీరోగా నటించిన యశ్ మొదట సీరియల్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఈయన తన సహచర నటి అయిన రాధికా పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పెద్దలందరి సమక్షములో 2016 డిసెంబర్ 9 న ఒకింటి వారయ్యారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో వీరు అప్పుడప్పుడు చేసే పోస్ట్ లు బాగా వైరల్ అవుతుంటాయి.

హీరో తర్వాత అంత క్రెడిట్ దక్కించుకున్న పాత్ర అధీరాగా నటించిన సంజయ్ దత్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈయన తన జీవితంలో చాలా బాధలను అనుభవించాడు. సంజయ్ మొదటి భార్య రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోవడంతో... మోడల్ రియాను పెళ్లాడాడు సంజయ్ దత్. అయితే సినిమా వాళ్లకు ఎన్ని సమస్యలు ఉంటాయో తెలిసిందే. అలా వీరిద్దరికీ కొన్ని మనస్పర్థల కారణంగా కొంతకాలం తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. దానితో మన్యథా దత్ అనే ఆమెను మూడవ భార్యగా చేసుకుని ఉన్నారు.  

కేజీఎఫ్ 2 లో బాలీవుడ్ నటి రవీనా టాండన్  ప్రధాని రమికా సేన్ గా రాఖీ బాయ్ కి దడ పుట్టించింది. ఈ పాత్రలో అంత శక్తివంతంగా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఈ పాత్ర హిట్ కావడంతో తనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈమె అనిల్ థడాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప మరియు బాబు ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ఒక గ్యాంగ్ స్టర్ ను కూడా తన అందంతో కట్టి పడేసిన రీనా పాత్రలో శ్రీనిధి శెట్టి నటించి యువకుల హృదయాలను కొల్లగొట్టింది. మొదటి పార్ట్ లో అంత స్కోప్ లేకున్నా కూడా రెండవ పార్ట్ లో తన పరిధిమేరకు నటించి డైరెక్టర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అయితే శ్రీనిధి శెట్టి మొదట్లో ఒక మోడల్ గా ఇండస్ట్రీకి వచ్చిందట. అలా తాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దృష్టిలో పడింది. అయితే ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: