ఒకప్పుడు టాలీవుడ్ లోనూ హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన నటి నవనీత్ కౌర్ ఆ తరవాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆయితే ఈమె అలాగే ఈమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వీరు చేసిన నేరం ఏమిటి అన్న వివరాలు ఇపుడు తెలుసుకుందాం. నార్త్ లో నుండి వచ్చిన నవనీత్ కౌర్ మొదట ఒక కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తరవాత టాలీవుడ్ లో "శ్రీను వాసంతి లక్ష్మి" అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సక్సెస్ కావడం తో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వరించాయి. రూం మేట్స్, స్టైల్, మహారది, యమదొంగ ( రంభగా పాటలో) వరుస చిత్రాలు చేసింది. కానీ ఒకటి కూడా అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు ను తెచ్చిపెట్టలేదు.

దాంతో  సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రేమించిన వ్యక్తి  ఎమ్ ఎల్ ఏ రవి రానా( రాజకీయ నాయకుడు) ను  వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. తన భర్త సహకారంతో పాలిటిక్స్ లోను ఈమె అడుగు పెట్టిన విషయం వితమే.  మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి 2019లో ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా తాజాగా శనివారం నాడు ముంబైలో హనుమాన్ చాలీసా పారాయణం అన్న అంశంపై జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఎంపీ అయిన నవనీత్ రానా మరియు ఆమె భర్త రవి రానాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీ లోకి తీసుకున్నారు.  వీరిపై ఐ సి సి సెక్షన్ -124 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వీరు పట్టుబట్టి చెప్పడంతో వీరిని అరెస్టు చేసి ఆదివారం బాంద్రా కోర్టులో హాజరు పరిచారు సదరు పోలీసు అధికారులు. ఇక దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వీరి వ్యవహారం మత, కుల విశ్వాసాలకు తావిచ్చేలా చిచ్చు రగిల్చేలా ఉన్నాయని అభిప్రాయపడింది.  భార్యాభర్తలు ఇరువురిని మే 6 వరకు జైలుకు పంపాలని ఆదేశించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: