కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆచార్య. ఈ సినిమాలో తండ్రి కొడుకులు నటించడం అదికూడా ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తోంది. మొదట్లో కాజల్ నీ కూడా అనుకున్నప్పటికీ తర్వాత కథలో మార్పులు చేయడంతో కాజల్ ను ఒప్పించి మరీ ఈ సినిమా నుంచి తప్పించడం జరిగింది. దర్శకుడు కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని సరికొత్త నేపథ్యంలో తెరకెక్కించనున్నారు అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సుమారుగా చిరంజీవి రెండు సంవత్సరాలు విరామం తీసుకొని ఇప్పుడు మళ్లీ తన కొడుకుతో కలిసి నటించడానికి సిద్ధం కావడంతో ఆ దృశ్యాన్ని వెండితెరపై కళ్ళారా చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఏప్రిల్ 29వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రానికి ఇటీవల తెలంగాణ సర్కారు టిక్కెట్ల రేట్లు పెంచుకునే విధంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో  ఒక టికెట్ పై  మల్టీప్లెక్స్ లలో 50 రూపాయలు పెంచుకునే విధంగా కూడా అవకాశం కల్పించడం ప్రస్తుతం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాదు సాధారణ ఏసీ థియేటర్లలో టికెట్టు కి 30 రూపాయలు పెంచుకునే విధంగా వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది.  ఆచార్య సినిమా ను 5 వ ఆటకి కూడా ప్రదర్శించు కోవచ్చని ఉత్తర్వుల జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది.

ఇదిలా ఉండగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఆచార్య సినిమా కు గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పవచ్చు. పదిరోజులపాటు టికెట్లను పెంచుకునే విధంగా వెసలుబాటు కల్పిస్తూ ఒక ప్రత్యేకమైన జీవోను కూడా విడుదల చేసింది. సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్ పది రోజులపాటు 50 రూపాయలు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం రూ.100 కోట్ల బడ్జెట్ చిత్రాలకు,  ఏపీలో తెరకెక్కించిన చిత్రాలకి  మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును కల్పించింది..కానీ  ఆచార్య సినిమా విషయంలో కేవలం చిరు కోసం మాత్రమే ఈ నిబంధనలను పక్కన పెట్టి టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి కల్పించడం గమనార్హం. ఏది ఏమైనా ఆచార్య సినిమా కి ఇది డబుల్ బొనాంజా అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: