సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'  లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత 'సర్కారు వారి పాట'  సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో  కీర్తి సురేష్ , మహేష్ బాబు సరసన కథానాయికగా నటిస్తుండగా,  ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  మైత్రీ ,  14 రీల్స్  సంస్థ  నిర్మించిన సర్కారు వారి పాట మూవీ కి  మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా నుండి తమన్ సంగీతం సమకూర్చిన కొన్ని పాటలను చిత్రం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా లోని సాంగ్ లలో కళావతి సాంగ్ విడుదలైన మొదటి నుండి కూడా ఫుల్ జోరు చూపించింది. తాజాగా కళావతి సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ ని సాధించింది. కళావతి సాంగ్ సర్కారు వారి పాట సినిమా నుండి ఫస్ట్ లిరికాల్ వీడియో సాంగ్ గా విడుదల అయ్యింది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన  ఈ సాంగ్ ని , సిద్ శ్రీరామ్ పాడాడు.

తాజాగా కళావతి సాంగ్  150 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించడంతో , ఈ సందర్భం గా ఈ సినిమా చిత్ర బృందం  స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ లో సముద్రఖని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.   సర్కారు వారి పాట మూవీ ని మే 12 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: