సినిమా పరిశ్రమలో రాణించాలంటే అదృష్టం అవకాశాలు మాత్రమే కాదు ఏ సినిమాలో నటించాలన్న అవగాహన కూడా ఉండాలి. లేదంటే ఎవరికైనా ఎన్ని అవకాశాలు వచ్చిన బూడిద లో పోసిన పన్నీరే అవుతుంది. ఆ విధంగా రష్మిక మందన ఏ సినిమాలో నటించాలి అనే విషయంలో ఇతర హీరోయిన్ల కంటే ఒక ఆకు ఎక్కువే చదివింది అనుకుంటా.. మంచి సినిమాలను ముందుగానే ఊహించి వాటిని చేస్తూ క్రేజ్ పెంచుకుంటుంది. హిట్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది ఈమె. ఆ సినిమాలలో తన పాత్ర కూడా బాగా ఉండేలా చేసుకుంటుంది.

ఆ విధంగా ఇటీవలే వచ్చిన ఓ పాన్ ఇండియా సినిమా యొక్క ఫ్లాప్ ను ముందే ఊహించి భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది. ఆ సినిమా ద్వారా తనకు పేరు రావడం ఏమో గానీ ఉన్న క్రేజ్ పోయినంత పనయింది అని చెప్పవచ్చు. అదే ఇటీవలే బాలీవుడ్లో విడుదలైన జెర్సీ సినిమా. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుంది అని అందరూ భావించారు అందుకే తెలుగు నిర్మాతలే ఈ సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించారు. 

ఈ నేపథ్యంలోనే పలు విడుదల తేదీలను పరిశీలించిన తర్వాత వీరు ఈ సినిమా ను ఇటీవలే విడుదల చేసారు. మంచి విజయాన్ని అందుకుంటుంది అని భావించిన ఈ సినిమా యొక్క ఫలితం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది అని చెప్పాలి ఈ సినిమా మంచి పేరును మాత్రం సంపాదించుకోగలిగింది కానీ కలెక్షన్స్ మాత్రం నిజంగా చాలా కష్టంగా తీసుకువస్తుంది అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రష్మికనే అనుకున్నారు కానీ ఏ కారణం వల్ల ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందో తెలియదు కానీ అదే ఆమెకు ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె భాగం కానీ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అపజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: