మిల్క్ బ్యూటీ తమన్న క్రేజ్ వేరే లెవల్..సినిమా సినిమాకు ఒక్కో సినిమాకు ఒక్కో టాక్ ను అందుకుంది.తన అందంతో, నటన, డ్యాన్స్ తో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది..దాంతో అమ్మడుకు విపరీతంగా ఫాలొయింగ్ పెరిగింది. ఒకవైపు రెండు చేతులా సినిమాలు చేస్తూనే మరో వైపు వానిజ్య ప్రఖటనలు కూడా చేస్తూ బాగానే సంపాదించింది. కొత్త హీరోయిన్లు వచ్చే కొద్ది మిల్క్ బ్యూటీకి అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి.సినిమాలు తక్కువ కావడం తో ఐటమ్ సాంగ్స్ లలో తలుక్కుమంది.అలా జనాలకు దగ్గరగానే ఉంది.


ప్రస్తుతం ఈ తమన్నా ఎఫ్3 సినిమాలో నటిస్తుంది. ఎఫ్2 ఎంత సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుంది..సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది..సోషల్ మీడియాలో కూడా తమన్నా బిజిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన తాజా పోస్ట్ లు పెడుతూ ట్రెండ్ లో ఉంటుంది. అయితే ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్లు కూడా వేస్తుంది..తమన్నా స్టైలింగ్‌ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. వేదికకు తగ్గట్టు రెడీ కావడం ఆమె ప్రత్యేకత. తాజాగా తమన్నా ధరించిన ఓ డ్రెస్‌ అభిమానులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.


అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ 'జీ కర్దా' ప్రారంభ వేదికపై పొట్టి దుస్తుల్లో కనిపించారు తమన్నా. ఆ వేడుకలో అందరి చూపు తమన్నా వైపే అని చెప్పడంలో సందేహం లేదు.ఆమె ధరించిన దుస్తుల ఆకర్షణ మరోవైపు. అంతే.. స్కై బ్లూ కలర్‌లో పొట్టిగా ఉన్న ఆ డ్రెస్‌ ఖరీదు ఎంతోనని ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు. సింపుల్‌గా, కురచగా ఉన్న ఆ డ్రెస్‌ ఖరీదు రూ. 2,69,121 అని తెలుసుకుని అవాక్కయ్యారు. అదీ కాకుండా మ్యాచింగ్‌ చెప్పుల ఖరీదు రూ.90,800 అని తెలిసింది.. ఇంత ఖరీదు పెట్టి డ్రెస్సులు అవసరమా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.ఎఫ్‌3' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. 'గుర్తుందా శీతాకాలం' చిత్రం కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. చిరంజీవి తో మరో సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: