బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అతి పెద్ద సినిమా పరిశ్రమను విమర్శిస్తున్నారు. ఇతర సినిమా పరిశ్రమలోని సినిమాలతో పోలిస్తే ఇక్కడనుంచి మంచి సినిమాలు రావడం లేదని అవమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మంచి సినిమాలు రావడం లేదనే విమర్శ ఇప్పుడు ఎక్కువవుతుంది. దానికి తగ్గట్లుగానే ఇతర భాషల సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని సినిమాలు ఆ చిత్రాల ముందు తేలిపోవడం వంటివి జరుగుతూ ఉండటంతో అందరూ బాలీవుడ్ సినిమా పరిశ్రమ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఆ విధంగా వచ్చిన సినిమా వచ్చినట్లే సౌత్ సినిమాలతో పోటీ పడలేక షెడ్డుకు వెళ్లిపోతుంటే ఇప్పుడు అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క పరువు కాపాడుతాడు అని కొంతమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దంగల్ సినిమా తో మంచి విజయం సాధించిన అమీర్ ఖాన్ ఇన్ని రోజులు అత్యధిక కలెక్షన్స్ రికార్డును తన వద్ద ఉంచుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ ను కే జి ఎఫ్ 2 సినిమా తో యశ్ సొంతం చేసుకున్నాడు. దంగల్ సినిమా రికార్డులను ఇప్పట్లో ఏ ఇండియన్ సినిమా కూడా బ్రేక్ చేయలేదు అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈ సినిమా రావడం  అన్ని సినిమాల రికార్డులను తుడిచిపెట్టుకు పోయేలా చేయడం జరిగింది. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో అతి పెద్ద టార్గెట్ ను కే జి ఎఫ్ సినిమా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ టార్గెట్ ను చేరుకోవాల్సిన బాధ్యత అమీర్ ఖాన్ పై ఉంది. ఆయన అభిమానులు మరియు ఇతర ఇండస్ట్రీ వర్గాల వారు తప్పకుండా ఈ రికార్డును లాల్ సింగ్ చద్దా బద్దలు కొడుతుందని బలంగా నమ్ముతున్నారు. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. దాని కంటే ముందు బాలీవుడ్ సినిమా పరిశ్రమ పరువు ను ఆయన కాపాడాలి. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇతర భాషల్లో సో సో కలెక్షన్స సాధించుకున్న కూడా హిందీ వర్షన్ లో 400 కోట్ల రూపాయలు సాధిస్తే ఈ రికార్డును అధిగమించడం పెద్ద అసాధ్యమేమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: