అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ ను వేగవంతం చేసింది.  ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.  ఇది ఇలా ఉంటే మే  9 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.  ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని పలువురు భావిస్తున్నారు.  

ఇది ఇలా ఉంటే మే 9 వ తేదీనే అడవి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేజర్ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది.  ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.  అడవి శేషు ప్రధానపాత్రలో తెరకెక్కిన మేజర్ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. మహేశ్ బాబు ఈ మూవీ కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.  మేజర్ మూవీ కి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఈ మూవీ లో కథానాయికగా సయీ మంజ్రేకర్ ,  ముఖ్యమైన పాత్రలో శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను మే 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఎఫ్ 3 మరియు మేజర్ సినిమా ట్రైలర్ లు రెండూ కూడా మే 9 వ తేదీన విడుదల కానున్నాయి.  మరి ఈ రెండు సినిమాల ట్రైలర్ లలో ఏ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: