బాలీవుడ్లో అర్జున్ కపూర్ ,మలైకా అరోరా ప్రేమ వ్యవహారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక వీరి ప్రేమ బాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు దేశం మొత్తం తెలిసేలా చేశారు. అందుకు ముఖ్య కారణం వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసమే అన్నట్లుగా సమాచారం. ఈ కారణంగానే ఈ జంటని ఎంతోమంది విమర్శిస్తున్నారు. 35 ఏళ్ళు ఉన్న అర్జున్ కపూర్.. కు 50 ఏళ్ళు దగ్గర్ల ఉన్నా మలైకా తో ప్రేమ ఏంటి అన్నట్లుగా ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే ప్రేమకు వయసుతో సంబంధం లేదనే విషయం వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ ఈ విషయాన్ని ఎన్నో రకాలుగా తెలియజేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుచేతనే త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారా అని ఇటీవల ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నేరుగా ఈ విషయాన్ని మలైకా ఒక ఇంటర్వ్యూలో తాజాగా విడుదల చేసినట్లు సమాచారం. ఇద్దరం వివాహం చేసుకొని ఆలోచనలు ఉన్నామని పరోక్షంగా వెల్లడించింది. ఇక తాము ఇద్దరం కలిసి జీవించి కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనుకుంటున్నట్లుగా తన మనసులో మాటను తెలియజేసింది.

ఇక రాబోయే భవిష్యత్తుకి తగ్గట్టుగానే తమ ప్లానింగ్ జరుగుతోందని.. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు విషయాలు తీసుకోకూడదని తెలియజేసినట్లు గా సమాచారం. అయితే అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఈ ఏడాది వివాహం జరగడం ఖాయమనే సింది అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వివాహం మలైకా కి రెండవ వివాహం అవుతుంది. గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్జాన్ ఖాన్  ను 1997 లో ప్రేమించి వివాహం చేసుకుంది ఇక వీరిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. మనస్పర్ధలు కారణంగా 2017లో విడిపోయారు. ఇక ఆ తర్వాత అర్జున్ కపూర్ కి దగ్గర అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: