
ఇక అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడ ఇంటర్నేషనల్ స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ఎంతలా ఈమె పాపులారిటీ సంపాదించుకుంది అంటే ఇంస్టాగ్రామ్ లో ఈమె పెట్టే ఒక్కో పోస్టుకు ఏకంగా పది లక్షలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రియాంకా చోప్రా కు కేవలం సామాన్య ప్రేక్షకులు మాత్రమే అభిమానులు కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులు గా మారడం గమనార్హం. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సింగర్ ప్రియాంక కు వీరాభిమాని.. ఇక అతడు ప్రియాంక పై ఉన్న అభిమానాన్ని చాటుతూ ప్రియాంక ముఖచిత్రాన్ని తన వీపుపై టాటూ గా వేయించుకున్నాడు.
అతను ఎవరో కాదు అమెరికా ప్రముఖ సింగర్, ర్యాపర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్ ఆహుజా.. ప్రియాంక ముఖచిత్రాన్ని టాటూ వేయించుకోవడమే కాదు ఆమె పేరును కూడా ట్యాటూ గా వేయించుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా అది బాగా వైరల్ గా మారుతోంది. అంతే కాదు ఆకాష్ ఇటీవల పాడిన ఒక పాటను కూడా హీరోయిన్ ప్రియాంక చోప్రా కే అంకితం చేయడం మరింత విశేషమని చెప్పవచ్చు. ఇది చూసిన చాలామంది ఇతనికి పిచ్చి ముదిరింది అని విమర్శలు చేస్తూ ఉండగా మరి కొంతమంది అభిమానం అంటే ఇదే అంటూ అతడికి మద్దతు పలుకుతున్నారు.