టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన విశ్వక్ సేన్ తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన రుక్సార్‌ దిల్లాన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి రవికిరణ్ కోలా కథను అందించగా , ఈ సినిమాకు విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించాడు. బాపీనీడు. బి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు , జై క్రిష్‌ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు.  

అలా  మంచి అంచనాల నడుమ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మే 6 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో  విడుదల అయ్యింది.  థియేటర్ లలో విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.  ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర  కలెక్షన్ లను  కూడా బాగానే రాబడుతోంది.  ఈ సినిమా నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. నైజాం : 1.44Cr , సీడెడ్ : 38L ,  యూ ఎ : 37L , ఈస్ట్ : 26L ,  వెస్ట్ : 17L , గుంటూర్ : 23L , కృష్ణ : 25L , నెల్లూర్ : 12L.

రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు గాను అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా 3.22 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా, 6.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా  0.18 కోట్లు , ఓవర్సిస్ లో 0.50 కోట్ల  కలెక్షన్లను వసూలు చేసింది.
నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా అశోకవనంలో అర్చన కళ్యాణం సినిమా: 3.90 కోట్ల షేర్ కలెక్షన్లను , 7.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: