ఇటీవలి కాలం లో ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీ పైన ఆధార పడుతూ వుంటారు చాలా మంది. ఒకవేళ ఇండస్ట్రీలో అవకాశాలు లేక పోతే ఎంతో ఒత్తిడికి గురవుతూ డిప్రెషన్ లోకి వెళ్లి పోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక అవకాశాలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తారు. కానీ హీరోయిన్గా అవకాశాలు రాకపోతే మరో ప్రొఫెషన్ వైపు వెళ్లాలని మాత్రం అస్సలు అనుకోరు అని చెప్పాలి. కానీ తాను మాత్రం అలా కాదు అంటూ చెబుతుంది ఇక్కడ ఒక హీరోయిన్. హీరోయిన్గా అవకాశాలు రాకపోతే హాయిగా ఉద్యోగం చేసుకుంటూ అంటూ చెబుతుంది. ఈ హీరోయిన్ ఎవరో కాదు నివేదా పేతురాజ్.


తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా అటు నివేదా పేతురాజ్ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఈ అమ్మడు అందుకునేది అడపాదడపా అవకాశాలు అయినప్పటికీ  ఇక ప్రతీ పాత్రలో ఒదిగి పోయిన తీరు మాత్రం ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పాలి. ఇటీవలి కాలం లో వివిధ పాత్రల్లో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది నివేద పేతురాజ్. ఈ క్రమం లోనే ఇటీవల వరుస అవకాశాలు అందుకుంటోంది.



 ఇకపోతే హీరోయిన్గా అవకాశాలు రాకపోతే ఏం చేస్తారూ అన్న విషయం పై స్పందించింది. హీరోయిన్ గా కన్నా నటిగా అనిపించుకోవడం గౌరవం గా ఉంటుందని నివేద పేతురాజ్ చెప్పు కొచ్చింది. ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ హీరోయిన్ గా సినిమాలు చేయకపోతే కెరియర్ ఉండదేమో అని అందరూ అనుకుంటారు. కానీ నా విషయంలో అలా కాదు నేను ఎలాంటి బౌండరీలు పెట్టు కోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే చేస్తాను.. ఒకవేళ హీరోయిన్గా అవకాశం రాక పోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. హాయిగా ఉద్యోగం చేసుకుంటాను అంటూ నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: