తెలుగు సినిమా పరిశ్రమకు సరికొత్త సాంకేతిక పరిచయం చేసిన హీరో ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. తొలిసినిమా స్కోప్ తో 70MM గూడచారి సినిమా ని కలర్ మూవీ గా తెరకెక్కించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు యువ హీరో సుధీర్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. తను నటించబోతున్న మామ మశ్చీంద్ర సినిమాకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ విడుదల చేశారు వాటి గురించి చూద్దాం.


ప్రముఖ రచయిత హర్షవర్ధన్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాతో మంచి సక్సెస్ అయ్యారు సుధీర్ బాబు. కొంత విరామం తీసుకున్న తర్వాత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు చేతిలో వరుసగా మూడు ప్రాజెక్టులు ఉన్నాయి అందులో మామ మశ్చీంద్ర అనే చిత్రం కూడా ఒకటి. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజున ఈ సినిమాకు సంబంధించి సర్ప్రైజ్ గ్లింప్స్  ను విడుదల చేశారు .


మూవీ లో సుధీర్ బాబు మ్యాచ్ మ్యాన్ గా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. ఇందులో తాజాగా విడుదల చేసిన గ్లింప్స్  చూస్తే మనకు తెలుస్తుంది. షర్టు లేకుండా సుధీర్ బాబు వర్కౌట్స్ చేస్తూ గాల్లో తేలుతున్న విన్యాసాలు డాన్స్ చూస్తే సుధీర్ బాబు లుక్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇ సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర LLP బ్యానర్ పై నారాయణ దాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆయన మరణించడంతో ఈ సినిమా బాధ్యతలన్నీ పుష్కర్ రామ్మోహన్రావు చూసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం తో పాటుగా సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఇంద్రగంటి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: