సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో పూనమ్ కౌర్ ఒకరనే విషయం తెలిసిందే. తక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నా పూనమ్ కౌర్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తక్కువేమీ కాదు.


పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా పీకే లవ్ అని ఆ పోస్ట్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తనకు అన్యాయం జరిగిందని పలు సందర్భాల్లో కూడా పూనమ్ చెప్పుకొచ్చారు.


పీకే లవ్ అని పూనమ్ ఉండే లా చూసుకోవడంతో పీకే లవ్ అంటే ఏమిటని చాలామందిలో కూడా సందేహం ఉంది. తాజాగా ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారట.. అయితే నెటిజన్ కామెంట్ కు పూనమ్ కౌర్ స్పందిస్తూ ఏ రీజన్ లేకపోయినా మీరు నన్ను టీజ్ చేస్తుంటారు కదా అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారట.అయినా కూడా నేను ఇలా నే చేస్తుంటానని అర్థమైందా తమ్ముడు అంటూ పూనమ్ కౌర్ కామెంట్ కూడా చేశారు.


పూనమ్ కౌర్ చేసే ట్వీట్ల లో చాలా ట్వీట్లు కూడా ప్రేక్షకులకు అర్థం కాని విధంగా ఉంటాయి.


పరోక్షంగా కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలను ఉద్దేశించి పూనమ్ కౌర్ పోస్టులు ఉంటున్నాయి. అయితే ఆ విషయాలను డైరెక్ట్ గా అంగీకరించడానికి పూనమ్ కౌర్ మాత్రం అంగీకరించరు. పూనమ్ కౌర్ ఈ ఏడాది నాతిచరామి అనే సినిమాలో నటించగా ఆ సినిమాకు ఆశించిన స్థాయి లో అయితే రెస్పాన్స్ రాలేదు.

పూనమ్ కౌర్ మనసులోని బాధ ఏంటో తమకు అర్థం కావడం లేదని కొంతమంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తారు. తెలుగులో ని ఒక స్టార్ హీరోకు అనుకూలంగా కొన్ని సందర్భాల్లో పోస్టులు పెట్టే పూనమ్ కౌర్ మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఆ స్టార్ హీరోను తిడుతూ పోస్టులు పెడుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: