మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. రామ్ చరణ్ తేజ్ తో కలిసి ఆయన నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి పెడుతుంది అని అందరూ నమ్మారు కానీ అనుకున్న ఫలితం ఈ చిత్రం ఇవ్వలేదు. ప్రతి ఒక్క మెగా అభిమానిని కూడా ఈ చిత్రం ఎంతగానో నిరాశపరిచింది. ఎంతో నమ్మకం పెట్టుకొని చేసిన ఈ సినిమా ఇలా అయిపోయింది అని అందరూ చాలా బాధపడ్డారు.

ఇప్పటికీ ఈ సినిమా ఇలా ఫ్లాప్ అవడంతో ఎవరూ జీర్నించుకోలేకపోతున్నారు.  వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న కొరటాల శివ కూడా ఈ చిత్రం ఫ్లాప్ అవకుండా ఉండడానికి ఏ మాత్రం సహకరించ లేకపోయారు. ఆ విధంగా ఆచార్య సినిమాను మొహమాటానికి ఒప్పుకొని చిరంజీవి ఈ విధమైన భారీ ఫ్లాప్ ను తెచ్చుకున్నాడు అని చెప్పవచ్చు. ఇప్పుడే కాదు గతంలో కూడా మొహమాటానికి పోయి సినిమాలు ఒప్పుకుని ఫ్లాప్ లు తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇంత పెద్ద స్టార్ అయిన చిరంజీవి ఒక సినిమా విషయంలో మొహమాటానికి పోవడం నిజంగా మెగా అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. అదే సమయంలో వారిని ఆశ్చర్యపరుస్తుంది కూడా. 

ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో ఈ విధమైన ఫ్లాపులు తెచ్చుకోవడం సరి కాదు అని అభిమానులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరిచే సినిమాలే. తప్పకుండా వీటి ద్వారా ఆయన విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తన సినిమాల విషయంలో ఎంతో క్లారిటీ గా ఉంటూ వరుస విజయాలను అందుకొనీ మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి ఏ విధమైన సినిమాలను ఎంపిక చేసుకొని మరింతగా సక్సెస్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: