టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఒకే ఒక్క పొరపాటు ఇప్పుడు ఆమె కెరీర్ ఎంతో ప్రభావం చూపిస్తుందట. ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు అని టాలీవుడ్ సినీ సర్కిల్ లో ఈ రకమైన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమలోకి వచ్చి చాలా రోజులే అవుతున్నా తమన్నా ఇలా కొత్త హీరోయిన్ లా చేయడం ఆమె అభిమానులకు కూడా నచ్చడం లేదు. ఆమె అయిపోయిందన్న ప్రతి సారి హిట్ తో కం బ్యాక్ చేస్తుంది. మళ్ళీ మరిన్ని అవకాశాలను అందుకుంటుంది.

అలా ఇప్పుడు ఆమె ఎఫ్ 3 సినిమా ద్వారా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. దాంతో ఆమెకు మరికొన్ని అవకాశాలు రావడం ఖాయం అని అందరు అనుకున్నారు. కానీ ఎఫ్ 3 సినిమా యూనిట్ తో ఆమె గొడవ పెట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎంతో చర్చనీయాంశం అయ్యింది. విషయం ఏంటో తెలియదు కానీ అందులో తమన్నా తప్పే ఉందని అందరు అంటున్నారు. ఏదేమైనా తమన్నా కి హిట్ వచ్చిన సమయంలో ఇలా కెరీర్ పై ప్రభావం పడే ఇష్యూ లలో చిక్కుకోవడం మంచిది కాదు.

ఎఫ్ 3  సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ మొత్తం ఎంతో హుషారుగా పాల్గొంటుంటే తమన్నా మాత్రం అసలే పాల్గొనకపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఆమె నటించిన సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ లో ఎంతో హుషారుగా పాల్గొనే తమన్నా ఈ విధంగా ఈ సినిమా కు పాల్గొనకపోవడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే విషయమే. మరి ఎలాగూ సినిమా అవకాశాలు మెల్లగా అందుకుంటున్న తమన్నాసినిమా తో టాలీవుడ్ కి పూర్తిగా బాయ్ బాయ్ చెప్పినట్లే అనుకోవాలి. ఆమె చేతిలో వెబ్ సిరీస్ లు తప్పా పెద్దగా పేరున్న సినిమాలు ఏవీ లేవు. చిరు సరసన ఆమె చేస్తున్న భోళా శంకర్ సినిమా ఎప్పుడో ఒప్పుకున్నా సినిమా కాగా కొత్తగా ఆమెకు సినిమా అవకాశాలు ఏవీ రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: