లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో విడుదల అయ్యింది. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించగా , సూర్య ఆఖరిలో గెస్ట్ పాత్రలో కనిపించి మెప్పించాడు.

హేమాహేమీలు అయిన నటీనటులు ఈ మూవీ లో నటించడం , లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో మొదటి నుండి ప్రేక్షకులు విక్రమ్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని కేవలం మూడు రోజుల్లోనే 150 కోట్ల కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్న విక్రమ్ సినిమా గురించి కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ఆయన తలపతి విజయ్ అదిరిపోయే కామెంట్ లను చేశాడు. తాజాగా విక్రమ్ మూవీ ని చూసిన తలపతి విజయ్సినిమా పూర్తిగా తనకు నచ్చింది అని అన్నారు.

అది మాత్రమే కాకుండా విక్రమ్ మూవీ కి వస్తున్న రెస్పాన్స్ పట్ల తలపతి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. విక్రమ్ మూవీ యూనిట్ కి తలపతి విజయ్ కంగ్రాట్స్ తెలిపారు. ఇది వరకు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ మూవీ లో తలపతి విజయ్ హీరోగా నటించాడు. ఈ సినిమా అటు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని విజయ్ కి అందించింది. అలాగే విక్రమ్ మూవీ తర్వాత కూడా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తళపతి విజయ్ నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: