దేశం గర్వించదగ్గ నటుడు, పాన్ ఇండియా స్టార్ హీరో, లోకనాయకుడు కమలహాసన్ ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. బాల నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టి హీరోగా మారి తెలుగు తమిళ హిందీ భాషలలో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించి స్టార్ హీరోగా ఎదిగారు.ఇక ఆ తర్వాత నిర్మాతగా కూడా ఆయన మారారు. తాజాగా కమల్ హాసన్ హీరోగా ఇంకా అలాగే నిర్మాతగా కూడా చేసిన విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో కమల్ హాసన్ కి బాగానే లాభాలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. దీంతో మరోసారి కమల్ హాసన్ ఆస్తుల గురించి ఆరా మొదలు పెట్టారు సినీ జనాలు.ఇక కమల్ హాసన్ కి చెన్నైలోనే కాక, ఇంకా అలాగే తమిళనాడులో కూడా కొన్ని ప్రదేశాల్లో అలాగే ఇంగ్లాండ్ లో కూడా బాగానే ఆస్తులు ఉన్నాయి. ఇటీవల కమల్ హాసన్ రాజకీయాల వల్ల తన ఆస్తుల లెక్క చెప్పాల్సిరావడంతో కమల్ తన వ్యక్తిగత ఆస్తిని 177 కోట్లుగా చూపించినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక చెన్నైలోని రెసిడెన్షియల్ సొసైటీలలో ఓ రెండు ఫ్లాట్‌ల విలువ దాదాపు రూ. 19.5 కోట్లు ఉంది. అలాగే తమిళనాడులోని ఇతర ప్రదేశాల్లో కమల్ కి ఇల్లు ఇంకా అలాగే వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. వాటి లెక్క వచ్చేసి దాదాపు రూ. 92.5 కోట్లు. అలాగే కమల్ హాసన్ కి దాదాపు 17 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూమి కూడా ఉందని తన ఆస్తుల వివరాల్లో ఆయన ప్రకటించారు.


ఇక అలాగే కమల్ హాసన్ చుట్టాలు చాలా మంది లండన్ లో ఉన్నారు. కమల్ హాసన్ కూడా రెగ్యులర్ గా లండన్ వెళ్లి వస్తూ ఉంటారు. దీంతో కమల్ అక్కడ ఇంగ్లాండ్ లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఇంగ్లాండ్ లో దాదాపు 3 కోట్ల విలువైన స్థిరాస్థులు కమల్ కి ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. అలాగే కమల్ దగ్గర ఒక bmw కారు ఇంకా ఒక లెక్సస్ కారు ఉన్నాయి. వీటి ఖరీదు దాదాపు 3 కోట్ల వరకు ఉంటుంది. ఇక కమల్ ఇటీవలే చెన్నైలోని తన రాజభవనం లాంటి ఇంటిని బాగా ఖర్చుపెట్టి రిపేర్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా కేవలం ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ. ఇవి కాకుండా ఆయన నిర్మాణ సంస్థ ఇంకా అలాగే రాజకీయ పార్టీ పేరు మీద కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.అవన్నీ కలుపుకుంటే ఇంకా 1000 కోట్ల పైనే ఆయన ఆస్తి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: