అందాల ముద్దుగుమ్మ కేథరిన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు  అయిన అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో , సరైనోడు మూవీ లలో హీరోయిన్ గా నటించింది . ఈ రెండు మూవీ లలో కూడా కేథరిన్ తన అంద చందాలతో, నటన తో ప్రేక్షకులను అలరించింది . ఇది ఇలా ఉంటే తాజాగా క్యాథరిన్ , శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన భళా తందనాన మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ ముద్దు గుమ్మ కు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.  ప్రస్తుతం క్యాథరిన్, నితిన్ హీ రోగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది . ఈ మూవీ తో పాటు క్యాథరిన్ , కళ్యాణ్ రామ్ హీరోగా మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బింబిసార సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది . 

ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి . ఈ రెండు మూవీ లు కనుక మంచి విషయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో కేథరిన్ పై క్రేజీ సినిమా అవకాశాలు దక్కే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు . నితిన్ హీరోగా క్యాథరిన్ కీలక పాత్రలో నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12 వ తేదిన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: