స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. అయితే బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు.ఇకపోతే బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో నరసింహ నాయుడు సినిమా కూడా ఒకటి. అంతేకాదు బాలయ్య హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2001 సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఇదిలావుంటే టైటిల్ తోనే ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. 

కాగా నరసింహనాయుడు తర్వాత బాలయ్య బి.గోపాల్ కాంబో మూవీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఊహించగా ఫ్యాన్స్ అంచనాలు నిజమయ్యాయి.ఇకపోతే  ఈ సినిమాకు పోటీగా మృగరాజు, దేవీపుత్రుడు సినిమాలు విడుదలైనా పైచేయి సాధించిన సినిమా మాత్రం బాలయ్య సినిమానే కావడం గమనార్హం.ఇక  ఈ సినిమా ఒక అరుదైన రికార్డును సైతం సొంతం చేసుకుంది. అంతేకాదు ఏలూరులోని అంబికా కాంప్లెక్స్ లోని రెండు థియేటర్లలో ఈ సినిమా వారం రోజుల్లో 101 షోలు ప్రదర్శితమైంది. ఇక కలెక్టర్ నుంచి అదనపు షోలకు అనుమతులు లభించడంతో ఈ సినిమా రోజుకు ఏడు, ఎనిమిది షోలు ప్రదర్శించబడి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

 అంతేకాదు దేశంలోనే ఈ అరుదైన రికార్డ్ బాలయ్యకు మాత్రమే సొంతమని సమాచారం అందుతోంది.అయితే కర్నూలు జిల్లాలో ఒకే ప్రింట్ తో కోడుమూరు, గూడూరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న సినిమా నరసింహ నాయుడు కావడం గమనార్హం.పోతే  సినిమా ఇండస్ట్రీలో మరే హీరోకు లేని ఈ అరుదైన ఘనత బాలయ్య బాబుకు సొంతమైంది.అంతేకాదు  నరసింహ నాయుడు సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేయగా ఆ రికార్డులలో చాలా రికార్డులు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: