ఎఫ్ 3 సినిమా లో తన అందచందాలను కుమ్మరించి ఆకట్టుకున్న సమంత ఇప్పుడు మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. యంగ్ ట్యాలెంటెడ్ హీరో గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుని స్టార్ హీరోగా మారుతున్నాడు సత్యదేవ్. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి నటుడిగా ఎదిగిన ఈ హీరో తన స్టార్ డమ్ గ్రాఫ్ ని నెమ్మదిగా పైకి తీసుకెళుతున్నాడు. ఈనేపథ్యంలో పెద్ద దర్శకులు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

అలా సత్య దేవ్ నటించిన రెండు సినిమాలు ఇప్పుడు విడుదల కు సిద్ధం అవుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం అయన పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన `గుర్తుందా సీతకాలం` సినిమా. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయిన కూడా మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూశారు. తాజాగా ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ తాజాగా లాక్ అయ్యింది. చాలా రోజుల తర్వాత సత్య దేవ్ తన కెరీర్ లో ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంలో నటిస్తుండగా అందులో తమన్నా కథానాయికగా నటించడం విశేషం.

వివిధ దశలలో భిన్నమైన ప్రేమకథలను ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించబోతున్నారట. తమన్నా భాటియా- మేఘా ఆకాష్- కావ్య శెట్టి లాంటి టాప్ క్లాస్ హీరోయిన్ లు ఈ సినిమా లో నటించడం మరింత విశేషం. మరి అయన హీరో గా చేసిన మరో చిత్రం గాడ్సే అనే మరో చిత్రం కూడా విడుదలకు కు సిద్ధమవుతున్న నేపథ్యంలో గుర్తుందా శీతాకాలం సినిమాజూన్ 15 వ తేదీన విడుదల కావడం మరింత విశేషం. మరి విజయాలు అందుకోవా లో కాస్త వెంకపడ్డ సత్య దేవ్ కి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: