నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బాలకృష్ణ వంద కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు.

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా కెరియర్ పరంగా బాలకృష్ణ కు 107 వ సినిమా కావడంతో ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్ బి కె 107 మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో బాలకృష్ణ తన మార్కు మేనరిజం డైలాగ్ లతో, యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు. ఈ మూవీ టీజర్ విడుదలయిన గంటల్లోనే అదిరిపోయే రేంజ్ వ్యూస్ ను , లైక్ లను సాధించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 7.28 మిలియన్ వ్యూస్ ను , 305.5 కే లైక్ లను సాధించి ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా కావడం , క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఎన్ బి కే 107 సినిమాపై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: