సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంత మంది తమ అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఉంటే, మరికొంతమంది తమ నటనతో ప్రేక్షకుల మనసు దోచుకొని సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. 

అలా సినిమా ఇండస్ట్రీలో అందం కన్నా ఎక్కువ గా తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.  క్రికెట్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ ఐశ్వర్య రాజేష్ కు మాత్రం నటిగా ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ , రిపబ్లిక్ వంటి పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇలా సినిమాల ద్వారా తనకంటూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఐశ్వర్య రాజేష్ క్లాస్ లుక్ లో సారీ ని  కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, చేతికి వాచీ పెట్టుకొని చాలా క్లాస్ గా, డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: