వెంకటేష్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అంతేకాదు ఆయన ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ కొత్త ట్రెండ్ ను టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తీసుకు రాబోతున్నారు. తెలుగులో అగ్ర హీరోలు వెబ్ సీరీస్ లలో నటించడం మొదలు పెట్టింది వెంకటేష్ అనే చెప్పాలి. అలాగే మల్టీ స్టారర్ సినిమా లు చేయడం కూడా ఆయనే మొదలు పెట్టారు. వెంకటేష్ కనుక ముందుకు రాకపోతే ఇప్పటికీ మల్టీస్టారర్ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు కలగానే మిగిలిపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మహేష్ బాబు తో కలసి మల్టీస్టారర్ సినిమాలో చేసిన వెంకటేష్ ఆ తర్వాత ఎంతో మంది హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశాడు.

తాజాగా ఆయన నటించిన ఎఫ్3 సినిమా కూడా మల్టీ స్టారర్ సినిమానే కావడం విశేషం. వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్3 అనే సినిమాలో నటించిన వెంకటేష్ ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కూడా ఆయన నటించబోయే మరొక హీరోతో కలిసి నటిస్తూ ఉండటం విశేషం. అది కూడా వెబ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వెంకటేష్ తన స్టార్డమ్ ను ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ విధంగా ప్రేక్షకులను అలరించే విధంగా మల్టీస్టారర్ సినిమాలో చేయడం అభిమానులను సంతోష పెడుతుంది.

ఇకపోతే వెబ్ సిరీస్ కాకుండా ఆయన తదుపరి నటించే సినిమాపై ఎవరికీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వెంకటేష్ నటించబోయే నెక్స్ట్ సినిమా కూడా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా వెంకటేష్ ఈ విధంగా ఇతర హీరోలతో కలిసి సినిమాలలో నటిస్తూ ఉండటం అందరినీ ఎంతగానో సంతోష పెడుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తాడని అంటున్నాడు. ఓ అగ్ర దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాదట

మరింత సమాచారం తెలుసుకోండి: