
థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మించనుండగా యువ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావలసిన ఈ మూవీ పూర్తి స్క్రిప్ట్ ని ఇటీవల పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం థమన్ తో కలిసి జర్మనీలో ఉన్న మహేష్ బాబుని కలిసి ఆయనకు పూర్తి స్క్రిప్ట్ ని వినిపంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నట్లు టాక్.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ జులై మొదటి వారంలో పట్టాలెక్కనున్నట్లు చప్తున్నారు. మహేష్, త్రివిక్రమ్ ల కెరీర్ లోనే కాదు యావత్ టాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన భారీ సినిమాల స్థాయిలో ఈ మూవీకి కూడా ఖర్చు చేయనున్నారట నిర్మాతలు. ఇక ఈ మూవీ కోసం మహేష్ ని కలవడానికి త్రివిక్రమ్ తో కలిసి జర్మనీ వెళ్లిన థమన్ నిన్న రాత్రి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సరికొత్త సినిమాతో సరికొత్త రికార్డులు మొదలు అంటూ మహేష్, త్రివిక్రమ్ ల మూవీ హ్యాష్ ట్యాగ్ ని పోస్ట్ చేసిన థమన్ ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ ని అదరగొట్టే రేంజ్ లో కంపోజ్ చేసినట్లు సమాచారం. మొత్తంగా ప్రారంభానికి ముందు నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు టాక్.