పెళ్లి సందD చిత్రంతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ శ్రిలిలా. రాఘవేంద్ర రావుకు నచ్చిన ఈ కుర్రహీరోయిన్ మొదటి సినిమాతోనే సక్సెస్ బాట పట్టించారు. ఈ చిత్రం ఒక మోస్తరు గానే మెప్పించిన కూడా ఆ తర్వాత వరుస ఆఫర్లతో అందుకుంటోంది. అతి తక్కువ సమయంలో ఎంతో మంది హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఈమె కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రం లో నటిస్తున్నది. ఇక ఇవే కాకుండా నాలుగైదు సినిమాలకు కమిట్ అయి బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా ఇతర భాషలలో సైతం ఈమె సినిమాల్లో నటిస్తున్నది ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు కెరీర్ ప్లాన్ సరిగా లేదేమో అన్నట్లుగా ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలా చేస్తున్న చిత్రాలు అన్నీ కూడా మీడియం రేంజ్ చిత్రాలు. స్టార్ హీరోల సినిమాలలో అసలు నటించడం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించాలి అంటే కచ్చితంగా స్టార్ హీరోల సినిమాలో నటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేరు లభిస్తుంది.


కానీ శ్రీ లీలా  మాత్రం స్టార్ హీరోల సినిమాలను దక్కించుకోలేక పోతోంది. స్టార్ హీరో సినిమా ఒకటి అంటే ఒకటి నటించిన కూడా ఈ అమ్మడు కెరియర్ మరొక లాగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే అవకాశం వస్తే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని వదులుకోను అని చెప్పినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ఉన్న వారందరిలో దాదాపుగా కూడా కెరియర్ ప్రారంభంలో స్టార్ హీరోలతో నటించిన వారు చాలా మంది ఉన్నారు. కనుక శ్రీలీలా ఇప్పటికైనా కాస్త రూటు మార్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇక ఈమే కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: