సూపర్ స్టార్ రజనీ కాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ విజయాలను సాధించిన సినిమాలలో చంద్రముఖి సినిమా ఒకటి. చంద్రముఖి సినిమాకు పి వాసు దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రభు మరియు జ్యోతిక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు.

హారర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం గా నిలవడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించింది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చంద్రముఖి సినిమాతో దర్శకుడు పి వాసు కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు పి వాసు చంద్రముఖి మూవీ కి సీక్వెల్ ను ప్రకటించిన విషయం మన అందరికి తెలిసిందే. చంద్రముఖి సీక్వెల్ లో హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు అయిన రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం చేసేసింది. ఇక ఈ సినిమాలో స్టార్ కమెడియన్ వడివేలు నటించనుండగా,  ఎం. ఎం. కీరవాణిమూవీ కి సంగీతాన్ని సమకూర్చబోతున్నాడు.

మూవీ కి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే చంద్రముఖి 2 మూవీ లో త్రిష ఒక ప్రధానమైన పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: