ప్రస్తుతం ఎక్కువగా ఓటిటి ల హవా నే ఎక్కువగా కొనసాగుతోంది టాలీవుడ్ లో వీటిని తగ్గించేందుకు తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది తెలుగు ఫిలిమ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో ఓటీటి ప్లాట్ ఫామ్ లో సినిమాలు ప్రదర్శన విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఇకపై థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలు 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటి లో విడుదల చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇలా చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఓటీటీ ప్రభావం వల్ల థియేటర్ కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోతుంది అని తెలిపారు. ఇదే క్రమంలో సినీ పెద్దలు కూడా చర్చించి దీనిపై ఒక కీలక నిర్ణయాన్ని తెలియజేయనున్నారు.


ఓటీటి లో సినిమాలు విడుదల అవ్వడానికి.. కనీసం 50 రోజుల సమయాన్ని పెట్టాలని ఇందుకోసం కీలకమైన సమావేశం టాలీవుడ్లో జరుగుతోందని సమాచారం. నిర్మాతలు పంపిణీదారులు ప్రేక్షకులను థియేటర్కు రప్పించడానికి ఎంతో కష్టపడుతున్నారని బన్నీ వాసు కూడా గతంలో తెలిపారు. సినిమా విడుదలతో పాటు ఏకకాలంలో ఓటేటి తేదీలను ప్రకటించడం వల్ల థియేటర్ రన్ పై కూడా వాటి ప్రభావం పడుతొంది. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది ఇది హీరోల మార్కెట్ కు కూడా చాలా హానికరం జరుగుతోందని ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం పెద్ద హాట్ గా మారుతుంది.

ఒక హీరో తన చిత్రాన్ని 50 రోజులపాటు థియేటర్లో చూడకుండా వేచి ఉండలేరు అందువల్లనే ఆన్లైన్లో రాకుండా చేస్తేనే మేలు జరుగుతుందని బన్నీ వాసు కూడా నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నట్లుగా వినిపిస్తోంది. నిన్నటి రోజున సినీపెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది.

ప్రస్తుతం ఓటీటి ప్లాట్ ఫామ్ లో పెద్ద ఎత్తున సినిమాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇందులో విడుదల అవుతుండటంతో ప్రేక్షకులు పెద్దగా సినిమా థియేటర్ల వైపు రాలేదని తెలిపారు. దీంతో నిర్మాతలకు భారీగా నష్టాలు వస్తున్నాయని సమాచారం అందుచేతనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: