2022 వ సంవత్సరంలో ఇప్పటి కొరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్బస్టర్ విజయాలను అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించగా,  మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో విడుదల అయ్యి కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే 2022 వ సంవత్సరంలో విడుదల అయ్యి ఓవర్ సీస్ లో అత్యధిక కలెక్షన్ లను సాధించిన 5 ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం .

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా 208 కోట్ల కలెక్షన్ లను ఓవర్ సీస్ లో సాధించింది.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ఓవర్ సీస్ లో 206 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


విక్రమ్ : లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా ఓవర్సీస్ లో 122 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.


బీస్ట్ : తలపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమా ఓవర్సీస్ లో 66 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


గంగుభాయ్ కతీయవాడి : ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగుభాయ్ కతీయవాడి మూవీ ఓవర్సీస్ లో 56 కోట్ల కలెక్షన్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: