ప్రతి వారం 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో మంచి మంచి తెలుగు కంటెంట్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ వారం కూడా తెలుగులో ఒక మూవీ మరియు ఒక వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తెలుగు మూవీ మరియు వెబ్ సిరీస్ వివరాలు తెలుసుకుందాం.

సమ్మతమే : కిరణ్ అబ్బవరం హీరోగా చౌదరి హీరోయిన్ గా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మతమే సినిమా జూన్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను పెద్దగా అందుకోలేకపోయింది. దానితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.  ఇలా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన సమ్మతమే మూవీ రేపు అనగా జూలై 15 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయినవారు ఉంటే జూలై 15 వ తేదీ నుండి ఈ మూవీ ఆహా 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.


మా నీళ్ల ట్యాంక్ : సుమంత్ హీరోగా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ జీ 5 'ఓ టి టి' లో జూలై 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రేమ్ సాగర్ – నిరోషా – బిగ్ బాస్ దివి – అన్నపూర్ణమ్మ – రామారాజు – అప్పాజీ అంబరీశ్ – బిందు చంద్రమౌళి – సందీప్ వారణాసి – లావణ్య రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott