మెగాస్టార్ వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి మనకు తెలిసిందే. ఈయన పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిరుత వేగంతో దూసుకుపోయారు. ఇలా తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయ్యారు.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన రామ్ చరణ్ గురించి హాట్ బ్యూటీ సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మాట్లాడారు.ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే బుల్లి తెరపై మొత్తం 6 సీజన్ల పూర్తిచేసుకుని ఏడవ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సమంత హాజరయ్యారు.అక్షయ్ కుమార్ తో పాటు సమంత ఈ కార్యక్రమానికి హాజరై తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ప్రస్తావించడం జరిగింది.


ఇకపోతే కరణ్ జోహార్ ఈ కార్యక్రమంలో భాగంగా సమంతను తన పెళ్లి విడాకుల గురించి  కూడా ప్రశ్నించాడు.ఇంకా అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన హీరోల గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడగగా ఈమె వారికి కొన్ని ట్యాగ్ లను కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ కరణ్ ప్రశ్నించగా వెంటనే రామ్ చరణ్ గురించి సమంత ఓజీ అనే ట్యాగ్ ఇచ్చేసింది.ఇక అల్లు అర్జున్ మ్యాజిక్ అంటూ సమాధానం చెప్పింది.ఈ విధంగా సమంత రామ్ చరణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఓజీ అంటే ఏంటీ అని వెతకడం ప్రారంభించారు.ఇక ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని తెలియడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమంత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: