అందాల ముద్దుగుమ్మ దివి బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఎవరికీ తెలియదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో కంటే ముందు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో ఒకటి , రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపించింది. కాకపోతే బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం దివి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.

అలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంది.  అందులో భాగంగా ప్రస్తుతం దివి ఎక్కువగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తోంది. తాజాగా దివి , సుశాంత్ హీరోగా ప్రియా ఆనంద్ హీరోయిన్న తెరకెక్కిన మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. అలాగే పరంపర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.  

ఇలా ప్రస్తుతం దివి వరుస వెబ్ సిరీస్ లలో అవకాశాలను దక్కించుకుంటుంది. ఇలా వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న దివి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు  తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా దివి ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. దివి కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు గార్జియస్ , లవ్ సింబల్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: