సినిమా పరిశ్రమలో ఎవరైనా రాణించాలంటే తప్పకుండా మంచి సక్సెస్ ఉండాలి. అప్పుడే అందరూ కూడా వీరిని పట్టించుకుంటారు. లేదంటే వారికి సినిమా పరిశ్రమలో నూకలు చెల్లినట్లే. ఆ విధంగా దర్శకుల విషయంలోనూ ఈ సక్సెస్ అనేది తప్పనిసరి అయింది. సక్సెస్ లేని దర్శకులకు ఏ హీరో కూడా డేట్లు ఇవ్వడు. సక్సెస్ ఉంటే ప్రతి ఒక్క హీరో కూడా సినిమా చేయమని అడుగుతూ ఉంటారు.  ఇది ఎన్నో రోజుల నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామం.

ఆ విధంగా ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు క్లిష్ట పరిస్థితులలో ఉన్నారు. ఒకప్పుడు భారీ విజయాలను అందుకొని పెద్ద హీరోలకు సైతం దొరకదుందా సినిమాలో చేసే దర్శకులకు ఇప్పుడు చిన్న హీరోలు సైతం సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం వారి పరిస్థితిని తెలియపరుస్తుంది. ఎన్నో గొప్ప గొప్ప కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడైన శ్రీను వైట్ల పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగోలేదని చెప్పాలి.  ఆయనకు సినిమా అవకాశం ఇచ్చే హీరో కూడా లేడనే చెప్పాలి. వరుస ప్లాపులు ఆయనను కృంగతీయగా మరికొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఆయన మంచి సినిమాలు చేయకపోవడానికి కారణం అవుతుంది.

ఇక కృష్ణవంశీ ఇప్పుడు పలు సినిమాలతో ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకుముందు ఆయన రూపొందించిన సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ నెలకొని ఉంది. ఇకపోతే మరొక క్రేజీ దర్శకుడు అయిన గుణశేఖర్ కూడా ఇప్పుడు ఫామ్ లోకి రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు చిరంజీవి లాంటి హీరోలను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. వీరు మాత్రమే కాదు చాలామంది పెద్ద దర్శకులు ఇప్పుడు చేతిలో సినిమాలు లేక వేనుకపదిపోతున్నారు. వీరు చేస్తున్న ఫ్లాప్ సినిమాలకు మంచి పేరు వచ్చినా కూడా ఫ్లాప్ అయిన కారణంగా హీరోలు వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: