మంచి హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ మరో బ్యూటిఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం..ఇక ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ఒక యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్..హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై  సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.. ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం ఇంకా హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు..ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగష్టు 5న థియేటర్స్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది..ఈ క్రమంలోనే మేకర్స్ ప్రొమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసారు.. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి సీతా రామం ట్రైలర్ ను కూడా లాంచ్ చేసారు.. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం కూడా చాలా ఎమోషనల్ గా సాగుతుంది.. ఒక మంచి ప్రేమకథను మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించడంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.


ఈ ట్రైలర్ మొత్తం కూడా రామ్ ఇంకా సీత ల మధ్య ఉన్న ప్రేమ కథను చూపించారు.. ఇందులో హాట్ బ్యూటీ రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటించింది.. ఒక ఉత్తరాన్ని సీతకు అందించే ప్రయాణం చేస్తూ ఉంటుంది రష్మిక మందన్న .. మరి చివరికి ఇక ఆ ఉత్తరం ఇచ్చిందో లేదో.. రామ్ ఇంకా సీత మధ్య ఏం జరిగిందో అనేది సినిమా చూసే వరకు ఆగాల్సిందే.. దుల్కర్ ఇంకా మృణాల్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది.. అయితే ఇంకా చాలా అంశాలు, సినిమా అసలు పాయింట్ ట్రైలర్ లో చూపించలేదట. అవి సినిమాలోనే చూడాలట. ఈ సినిమాపై మూవీ టీం చాలా నమ్మకంగా వుంది.ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, సమంత, వెన్నెల కిషోర్ ఇంకా మురళీ శర్మ వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. మరి ఇక ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: