కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఎన్నో అంచనాలతో పెద్ద పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆసక్తికరమైన సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్ ఇంకా అలాగే కిచ్చా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఇంకా సాంగ్స్ ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ రారా రక్కమ్మ అయితే రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా కూడా ఇక ఈ సాంగ్ పైనే చర్చ, యువత రీల్ చేసి మరీ ప్రమోషన్స్ ను బాగా పెంచేశాయి. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన జాక్వలిన్ పెర్నాండజ్, సుదీప్ తో కలిసి సూపర్ గా ఆడిపాడింది.నార్త్ టూ సౌత్ తెగ ఊపేస్తున్న ఈ పాటని ఇక తెలుగులో స్టార్ సింగర్ మంగ్లీ ఈ గీతాన్ని ఆలపించింది.


ఒక్క కన్నడలోనే కాకుండా ఈ సాంగ్ ఐదు భాషల్లో కూడా చాలా రచ్చ రేపుతోంది. ఇక ఈ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ తో అయితే సినీ ప్రముఖులు కూడా రీల్స్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.ఇక అలాంటి పాట వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ పెంచేసిన చిత్ర బృందం అభిమానులకు ఎంతగానో నచ్చిన ఈ సాంగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో రక్కమ్మ గా జాక్వలిన్ అందాల జాతర కుర్రాళ్లను బాగా ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింట వైరల్ గా మారింది. మరి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఇక ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.కేజీఎఫ్ 2 భారీ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు యష్.. ఇక సుదీప్ కూడా యష్ లాగే భారీ పాన్ ఇండియా హిట్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: