టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ కు ఏ దర్శకుడు కూడా సరైన విజయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. నటుడిగా ఏ స్థాయిలో నటిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసింది. అంత పెద్ద కటౌట్ కి సరైన సినిమా పడితే తప్పకుండా భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే గోపీచంద్ లాంటి మాస్ హీరోని వాడుకోవడం తెలియట్లేదు ఇటీవల కాలంలో ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకులకు. ఎలాంటి సినిమా చేస్తే ఆయనకు ఆయన అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందో అలాంటి సినిమా చేయకుండా వేరే ఏదో జోనల్లో సినిమాలు చేస్తూ ఆయన క్రేజ్ ను తగ్గిస్తున్నారు.

ఏదేమైనా కూడా గోపీచంద్ కూడా తన సినిమాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే క్రేజ్ ఉన్నా కూడా ఆయనకు వచ్చే ఫ్లాప్ ల వల్ల ఆయన స్టార్ డమ్ తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష్యం లౌక్యం వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన ఈ దర్శకుడు ఈ హీరోతో కలిసి మూడవ హిట్ సినిమాను అందించే విధంగా ముందుకు పోతున్నాడు. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం. ఇక గత రెండు మూడు సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాడు.

గోపీచంద్ ఇటీవల విడుదల చేసిన పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ సినిమా కావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం హిట్ చేయలేకపోయారు. మొదటి నుంచి ఈ సినిమాను చూడలేకపోయారు. ఆ విధంగా గోపీచంద్ సినిమాల పట్ల కొంత జాగ్రత్త వహించాల్సింది అని అంటున్నారు. ఇకపోతే గోపీచంద్ ఇప్పుడు మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు అని చెబుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు రాగా రెండు కూడా సోషూ గానే విజయాన్ని అందుకున్నాయి మరి ఇప్పుడు చేస్తున్న ఈ మూడవ సినిమా అయినా భారీ విజయాన్ని ఈ కాంబినేషన్ కు తెచ్చిపెడుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: