తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేర్కొంది హీరోయిన్ సాయి పల్లవి. ఇక డాక్టర్ చదివినప్పటికీ ఇమే నటనపరంగా బాగానే ఆకట్టుకుంటూ ఉంటుంది. కస్తూరి మాన్ అనే తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ప్రేమమ్ చిత్రం ద్వారా మలయాళం లో అడుగు పెట్టింది. ఇక తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.. దీంతో మొదటి చిత్రంతోనే ఇక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఈమె చెప్పే డైలాగులు ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇక అంతే కాకుండా ఎక్స్పోజింగ్ చేయకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలలో నటిస్తూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నది.ఇక అంతే కాకుండా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ మధ్యకాలంలో సాయి పల్లవి టైం అసలు బాగోలేదని చెప్పవచ్చు.. అయితే గత సంవత్సరం లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సాయి పల్లవి ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోతోంది ఇటీవల విడుదలైన విరాటపర్వం సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ సాయం పల్లవి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నది.. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా కలెక్షన్లను రాబట్ట లేక పోయింది. ఇక ఆ తరువాత గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా జులై 15న విడుదల కావుగా ఈ చిత్రం కూడా ఆకట్టుకోవడంలో ప్రేక్షకుల దగ్గర విఫలమైందని సమాచారం.


దీంతో సాయి పల్లవి కాతాలో ప్రస్తుతం రెండు వరుస ప్లాపులు వచ్చి పడ్డాయని చెప్పవచ్చు.. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఏం చేయబోతోంది తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అన్నాది ఇప్పుడు అభిమానుల్లో సందేహంగా మారుతోంది. అయితే గార్గి సినిమా తర్వాత ఈమె ఏ ఒక్క సినిమా కూడా అప్డేట్ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రం తర్వాత తను ఏ ప్రాజెక్టుకి సైన్ చేయలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి తన తదుపరి ప్రాజెక్టు కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: