టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాగ చైతన్య గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న నాగ చైతన్య మరి కొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చడ్డా లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఆగస్ట్  11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హిందీ తో పాటు తెలుగు ,  తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.

మూవీ ని తెలుగు లో చిరంజీవి సమర్పిస్తాడు. ఈ మూవీ లో నాగ చైతన్య 'బాలరాజు' అనే పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి నాగ చైతన్య కు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించాడు.

జర్నీ ఆఫ్ బాలరాజు ఎప్పటికీ తనకు సూపర్ స్పెషల్ గా ఉంటుంది అని నాగ చైతన్య తెలియజేశాడు. లాల్ సింగ్ చడ్డా మూవీ లో తీసుకున్నందుకు గానూ, మూవీ యూనిట్ కి నాగ చైతన్య థాంక్స్ తెలిపారు. ఈ మూవీ లో అమీర్ ఖాన్ హీరో గా నటించగా ,  బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ మూవీ అయిన ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాల పై ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: