కరోనా పాండమిక్ తర్వాత  పరిస్థితులు సినిమా వాళ్ళందరినీ కూడా కుదిపేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నిర్మాతలకు కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ముందు అనుకున్న బడ్జెట్ ఒకటైతే ఇక పాండమిక్ తర్వాత అవుతున్న బడ్జెట్ మరొకటి ఉంటుంది. ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్   పెరగడం మరోవైపు సినీ కార్మికులు  ఇచ్చే పైకం  పెంచడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీనికితోడు ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు సైతం తొలివారంలోనే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉండడం గమనార్హం.


 అయితే ఇటీవలే రవితేజ హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ఇదే బాటలో వెళ్తుందా అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. ఇక వారం కూడా ముగియకముందే బాక్సాఫీస్ వద్ద డ్యూటీ తిరిగేందుకు ఈ సినిమా సిద్ధమైంది అనేది తెలుస్తుంది. నాలుగు రోజుల్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేసింది 4.63 కోట్ల షేర్, 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.


 ఈ క్రమంలోనే నిర్మాతకు నష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి సమయంలో రవితేజ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. నిర్మాతలతో చర్చలు జరిపి ఒక ప్రామిస్ కూడా చేశారట. తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడట రవితేజ. ఫైనాన్షియల్గా కూడా అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చారట. ఇక నామినల్ రెమ్యూనరేషన్ కూడా తీసుకొని నెక్స్ట్ సినిమా కూడా చేసి పెడతాను అంటూ రవితేజ చెప్పారట. అయితే ఈ విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం రవితేజ ను తెగ పొగిడేస్తున్నారు. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి ఎంతో అవసరమని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: