ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని ప్రస్తుతం హీరోగా విజయవంతం గా కెరీర్ ను కొనసాగిస్తున్న సత్యదేవ్ తాజాగా గాడ్సే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే . 

మంచి అంచనాల నడుమ విడుదలైన గాడ్సే సినిమా బాక్సా ఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సత్యదేవ్ 'కృష్ణమ్మ' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా కృష్ణమ్మ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ఆగస్ట్ 4 వ తేదీన ఉదయం 11 గంటల 4 నిమిషాలకు  విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలియ జేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

పోస్టర్ లో సత్యదేవ్ కత్తి పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి కాలభైరవ సంగీతాన్ని అందిస్తుండగా , ఈ మూవీ ని సెప్టెంబర్ 2022 న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సత్యదేవ్ ప్రస్తుతం ఈ మూవీ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: