లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో లో తెరకెక్కిన భారతీయుడు మూవీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . 9 మే 1996 వ తేదీన విడుదల అయిన భారతీయుడు సినిమా బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది.

మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర ను పోషించింది. ఇలా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన భారతీయుడు మూవీ కి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2' అనే మూవీ ని కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇండియన్ 2 మూవీ లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇండియన్ 2 మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది.

అలా చాలా కాలం పాటు ఈ సినిమా నిలిచిపోవడంతో కమల్ హాసన్, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాలో నటించాడు. అలాగే దర్శకుడు శంకర్, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇండియన్ 2 మూవీ ప్రొడ్యూసర్ లు తిరిగి శంకర్ దర్శకత్వంలోనే ఇండియన్ 2 మూవీ ని తిరిగి ప్రారంభించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దానితో  ఇండియన్ 2 మూవీ షూటింగ్ తిరిగి సెప్టెంబర్ 13 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ 2 మూవీ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: