అలా చందమామ కథలు సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకొని గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అలా మెల్ల మెల్లగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ దర్శకుడుతో కలిసి కొంత మంది పెద్ద హీరోలు సైతం సినిమాలు చేయాలనీ చూశారు. అలా ఇప్పుడు అక్కినేని నాగార్జున ఈ దర్శకుడితో కలిసి సినిమా చేస్తుండడం విశేషం. అయన గత సినిమా గరుడవేగ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఆ తరహాలోనే నాగార్జున తో చేయబోయే సినిమాను చేస్తున్నాడు ఈ దర్శకుడు. తాజాగా ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
త్వరలోనే విడుదల తేదీని కూడా వెల్లడించనుంది. వాస్తవానికి ఈ సినిమా ను డిసెంబర్ లో విడుదల చేయాలనీ చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఆ నెలలో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న వార్తలు వినిపిస్తుండడంతో ఆ రోజున తన చిత్రాన్ని నాగార్జున విడుదల చేసే ధైర్యాన్ని చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్ భారీ విజయాలను అందుకోవాలని భావిస్తున్న నాగార్జున తన కొడుకు సినిమాకి పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయడనే చెప్పాలి. మరి దాని కంటే ముందే ఆయన ఈ సినిమాను విడుదల చేస్తాడా అనేది చూడాలి.