యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మధ్య సంబంధం ఉన్నట్లుగా ఎన్నో రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గీతగోవిందం సినిమాలో వీరిద్దరూ చేసిన రొమాన్స్ ఆ తరువాత డియర్ కామ్రేడ్ లో చేసిన రొమాన్స్ వల్ల వీరిద్దరి మధ్య పలు వార్తలు పుట్టుకొచ్చాయి అలాగే తరచూ వీరిద్దరూ కలిసి ఉండడం వల్ల కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో వీరిద్దరి మీద డేటింగ్ ఉన్నట్లుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే రష్మిక విజయ్ ఇద్దరు కూడా తమ వ్యక్తిగత జీవితాల పై వస్తున్న రూమర్లపై ఎన్నోసార్లు స్పందించడం జరిగింది. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమే అని కూడా తెలియజేశారు అయినప్పటికీ ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రష్మిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.


రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక విజయ్ తో ఉన్న రిలేషన్షిప్ గురించి తెలియజేసింది. ప్రజలు మన గురించి చాలా చెత్తగా మాట్లాడుతూ ఉంటారు అయినా వారిని నవ్వించడానికి నేను చాలా ఇష్టపడతానని తెలియజేసింది. ఇక అంతే కాకుండా నేను సంవత్సరానికి ఐదు సినిమాలకు పైగా చేస్తాను మీరు ఇంకా మొదటి సినిమా దగ్గరే ఆగిపోయారు అని తెలియజేసింది. మేము హీరోయిన్స్ కాబట్టి మా గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఆ విషయాన్ని మేము కూడా అర్థం చేసుకోగలము. కానీ ఇది కెరియర్ ప్రారంభం నుంచి ఇలాగే ఉన్నది .


ఇక అంతే కాకుండా ఆమె ఎవరిని చూస్తోందో ఏ వ్యక్తితో ఉంటుందో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇది నటీనటుల లైఫ్ కాబట్టి ఇలానే ఆలోచిస్తారని తెలియజేసింది. కానీ తన విషయానికి వస్తే మాత్రం నా విషయంలో నేను చెప్పే వరకు ఎలాంటి విషయాన్ని నమ్మవద్దని తెలియజేస్తుంది. ఇక విజయ్ కూడా కాఫి విత్ కరణ్ షోలో రష్మిక నేను మంచి స్నేహితులం మేమిద్దరం షూటింగ్ సమయంలో బాగా స్నేహితులమయ్యాము అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: