తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జబర్దస్త్, ఢీ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాడు హైపర్ ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక హైపర్ ఆది ఎక్కడ ఉన్నా కూడా ఎంత సరదాగా నవ్విస్తూ ఉంటారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ శివకు సంబంధించి ఒక ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతుంది ఇందులో యాంకర్ రష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది. ఇక ఈ షో కి ప్రతిరోజు ప్రేక్షకు ఆదరణ భారీగా పెరిగిపోతుందని చెప్పవచ్చు ఇందులో ముఖ్యంగా హైపర్ ఆది, ఇమ్మానుయేల్ ,ఆటో రాంప్రసాద్ తదితరులు స్కిట్లతో అలరిస్తూ ఉంటారు.


అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక టేబుల్ మీద  కంటెస్టెంట్స్ ఫొటోస్ పెట్టారు తమకు నచ్చని వారి ఫోటోలు చింపివేయాలని లేదా కాల్చివేయాలని రష్మీ అక్కడ చెప్పడం జరుగుతుంది.. ముందుగా వచ్చిన ఆటో రాంప్రసాద్ మాత్రం హైపర్ ఆది వల్ల ఒక విషయంలో తన పర్సనల్గా హర్ట్ అయ్యారని తెలియజేశాడు దాంతో అతని ఫోటోను తగలబెట్టారు అనంతరం పరదేశి వచ్చి నాకు అన్ని హైపర్ ఆది అని చెబుతారు.. కానీ ఒక పని వల్ల ఇలా చేయవలసి వస్తోంది అంటూ హైపర్ ఆది ఫొటోస్ చింపి వేయడం జరుగుతుంది.


దీంతో అక్కడున్న హైపర్ ఆది మాత్రం కంటతడి పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత టేబుల్ వద్దకు వెళ్లిన ఆది అందులో ఒక ఫోటో తీసి చేతిలో పట్టుకోవడం మనం గమనించవచ్చు ఆది ఎవరి ఫోటో పట్టుకున్నాడు అనే విషయం తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు మనం ఆగాల్సిందే. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కమెడియన్స్ సైతం మల్లెమాల సంస్థను వీడి ఇతర వాటిల కామెడీతో అలరిస్తూ ఉన్నారు. కానీ హైపర్ ఆది రాంప్రసాద్ తదితరులు మాత్రం ఈ షోని విడిచిపోలేదు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: