ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మాతలుగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ మూవీ మరో ఆరు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం..


భారీ అంచనాలతో విడుదల కానున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ కథనం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నా లైగర్ మూవీతో పూరీ జగన్నాథ్ ఆ విమర్శలకు చెక్ పెడతారని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.


లైగర్ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషురెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెహబూబా సినిమా సమయంలోనే పూరీ జగన్నాథ్ గారు పిలిచారని ఆయన తెలిపారు. మెహబూబా సినిమాలో నేను విలన్ గా నటించానని ఆయన కామెంట్లు చేశారు. డైరెక్టర్ కట్ చెప్పేవరకు నా రోల్ నేను పర్ఫెక్ట్ గా చేసినట్టేనని విషురెడ్డి అన్నారు. సినిమాలలో ఎవరి డ్యూటీ వాళ్లదని విషురెడ్డి కామెంట్లు చేశారు.


  నాకు సినిమాలు తప్ప వేరే ఏం తెలియదని విషురెడ్డి తెలిపారట.సినిమాలపై ఫ్యాషన్, ఇష్టం లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రావద్దని విషురెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమా బాగుంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. ఛార్మి నాకు నటిగా తెలుసని ఛార్మిని మొదటిసారి కలిసిన సమయంలో ఆమె హీరోయిన్ కదా అని అనుకున్నానని కానీ ఆమె చాలా చిల్డ్ గా ఉంటారని విషురెడ్డి అన్నారట.

  ఛార్మి అంత కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ ఎవరూ ఉండరని విషురెడ్డి పేర్కొన్నారు. మగాడి కంటే ఎక్కువగా ఛార్మి కష్టపడతారని పూరీ కనెక్ట్స్ ఆమె ప్రపంచమని విషురెడ్డి అన్నారు. ఛార్మి చాలా బాగా కష్టపడతారని విషురెడ్డి కామెంట్లు కూడా చేశారు. సినిమా మీద ఇష్టంతో చిన్నచిన్న పనులు కూడా ఛార్మి చేస్తారని విషురెడ్డి కామెంట్లు చేశారు. పూరీ కనెక్ట్స్ లో టాలెంట్ ను గుర్తిస్తారని విషురెడ్డి చెప్పుకొచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: